షణ్ముఖ్ జశ్వంత్.. షాకింగ్ రెమ్యునరేషన్!


యూట్యూబర్ గా మంచి క్రేజ్ అందుకున్న షణ్ముఖ్ జస్వంత్ ఆ తర్వాత సాఫ్ట్ వేర్ డెవలపర్ సూర్య అనే వెబ్ సిరీస్ లతో తన స్థాయిని మరింత పెంచుకున్నాడు అనే చెప్పాలి. అతి తక్కువ కాలంలో యూత్ కి బాగా కనెక్ట్ అయిపోయిన షణ్ముఖ్ జస్వంత్ ఇప్పుడు వెబ్ సిరీస్ ద్వారా కూడా సరికొత్తగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ప్రస్తుతం ఆహా సంస్థతో కలిసి అతను ఒక వెబ్ సిరీస్ చేస్తున్న విషయం తెలిసిందే.


సోలో బ్రతుకే సో బెటర్ దర్శకుడు సుబ్బు అందించిన కథతో అరుణ్ పవర్ డైరెక్ట్ చేస్తున్న ఏజెంట్ ఆనంద్ సంతోష్ (AAS) అనే ఒక వెబ్ సిరీస్ త్వరలోనే ఆహా ఓటిటి ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కానుంది. అయితే ఈ వెబ్ సిరీస్ కోసం షణ్ముఖ జశ్వంత్ దాదాపు 50 లక్షల నుంచి 60 లక్షల మధ్యలో రెమ్యునరేషన్ కూడా అందుకున్నట్లు సమాచారం. యూట్యూబ్ ద్వారానే అతనికి లక్షల్లో ఆదాయం లభిస్తుంది. ఇక ఇప్పుడు ఈ వెబ్ సిరీస్ ద్వారా మరింత ఎక్కువగా లాగుతున్నట్లుగా తెలుస్తోంది. అలాగే చర్చల్లో మరికొన్ని ఓటిటి ప్రాజెక్టులు కూడా ఉన్నట్లు సమాచారం.


Post a Comment

Previous Post Next Post