RRR కంటే పెద్ద మల్టీస్టారర్!


రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించిన బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఏ స్థాయిలో గుర్తింపు అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరపైకి తీసుకు వచ్చిన ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీ ద్వారా విదేశీయులను కూడా ఎంతగానో కొట్టుకుంటుంది. అయితే ఇంతకంటే పెద్ద మల్టీస్టారర్ సినిమాలను బాలీవుడ్ ఇండస్ట్రీలో రెడీ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ లో ఆదిత్య చోప్రా అందించిన కథతో ఇద్దరు బడా హీరోలు ఆ కథలో నటించబోతున్నారట. వారు మరెవరో కాదు సల్మాన్ ఖాన్ షారుక్ ఖాన్ అని ప్రస్తుతం బాలీవుడ్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇద్దరు ఇదివరకే కరణ్ అర్జున్ అనే మల్టీస్టారర్ సినిమా చేశారు. ఇక ఇన్నాళ్లకు బిగ్గెస్ట్ యాక్షన్ సినిమాను చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక 2024లో ఈ సినిమా మొదలయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.


Post a Comment

Previous Post Next Post