RC 15, వారసుడు.. ఒకటి కొంటే మరొకటి డిస్కౌంట్?


స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు రాబోయే రోజుల్లో బిగ్ బడ్జెట్ సినిమాలను రిలీజ్ చేయబోతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా శంకర్ రామ్ చరణ్ కలయికలో రానున్న ఫ్యాన్ ఇండియా సినిమా పై దిల్ రాజు చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమాకు అనుకున్న దాని కంటే బడ్జెట్ నెంబర్స్ కూడా గట్టిగానే పెరుగుతున్నాయి. అలాగే మరొకవైపు వంశీ పైడిపల్లి విజయ్ కాంబినేషన్లో వారసుడు అనే మరొక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు ఎలాంటి బిజినెస్ జరుగుతుంది అనేది ఆసక్తికరంగా మారింది. 

అయితే దిల్ రాజు ఈ క్రమంలో రెండు సినిమాలను ఒకేసారి అమ్మేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. అంటే ఒక సినిమా కొంటే మరొక సినిమా డీల్ లో డిస్కౌంట్ అన్నట్లు దిల్ రాజు మార్కెటింగ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా విజయ్ వంశీ పైడిపల్లి కలయికపై పెద్దగా అంచనాలు అయితే లేవు. ఇప్పటికి రొటీన్ అనే టాక్ అయితే ఎక్కువగా వచ్చింది. కాస్త కూస్తో రామ్ చరణ్ సినిమా పైన అంచనాలు ఉన్నాయి. అయితే డీల్స్ సరిగ్గా సెట్ అవ్వడం లేదు అనేది రెండు సినిమాలను ఒకే రేట్లో అమ్మడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇటీవల ఓవర్సీస్ డీల్ లో కూడా రెండు సినిమాలకు కలిపి 55 కోట్లకు అమ్మినట్లు సమాచారం.

Post a Comment

Previous Post Next Post