RamaRao On Duty - Review & Rating


కథ:
1995 చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం మాఫియాకు వ్యతిరేకంగా పోరాడుతున్న నిజాయితీ గల సబ్ కలెక్టర్ రామారావు. అయితే రామారావు (రవితేజ) నిజాయితీగా తన దారిలో వెళుతుండగా ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి అలాగే నిందితులు చేసిన ఘోరమైన నేరం సినిమా ప్రధాన కథాంశం. ఇక CI జమ్మి మురళి (వేణు) మొత్తం ప్రక్రియను ఎలా ప్రారంభించాడు ఇక అనుకోకుండా రామారావు విచారణలో ఎలా పాల్గొంటాడు అనేది సినిమాలోని మరో అంశం. ఇక ఈ పరిణామాలో రామారావు అన్యాయాన్ని ఎలా ఎదుర్కొంటాడు అనేది తెరపై చూడాలి.

విశ్లేషణ:
రామారావు ఆన్ డ్యూటీ సినిమాను జనాల్లోకి తీసుకు వెళ్ళడంలోనే ఇది టైటిల్ ఔట్ అండ్ ఔట్ మసాలా చిత్రంలా అనిపించినప్పటికి వెండితెరపై కథ కొనసాగిన విధానం మాత్రం సీరియస్‌గా ఉంది. దర్శకుడు శరత్ ఫస్ట్ హాఫ్ లో కొన్ని ఫ్యామిలీ సీన్స్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. మరోవైపు రామారావు అసలు ప్రేమించకుండా మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. అనంతరం తన ప్రేమలోనే ఒక ట్విస్ట్ అయితే పెట్టాడు కానీ అదేమి పెద్దగా ఆశ్చర్యపరిచేంత ట్విస్ట్ ఏమి కాదు.

ఇక కథ మధ్యలోకి చేరుకున్న అనంతరం అనుకోకుండా  గ్రామం నుండి 20 మంది యువకులు మిస్ అవ్వడం అనంతరం ఆ ప్రక్రియలో స్థానిక పోలీసు అధికారి జమ్మి మురళి (తొట్టెంపూడి వేణు) పాత్రలు కొనసాగే విధానం కాస్త నీరసంగానే ఉంటాయి. వేణు క్యారెక్టర్ కూడా అంత కొత్తగా ఏమి లేదు. ఎదో పరవాలేదు అనే విధంగా ప్రజెంట్ చేశారు. ఇక విరాజ్ అనే వ్యక్తి నిర్వహించే గంధపు చెక్కల మాఫియా ఘటనలు కథకు లింక్ అయ్యి ఉంటాయి. ఇక సెకండాఫ్‌లో రామారావు నిందితులను ఎలా పట్టుకుంటాడు అనే లైన్ తో కథ ముందుకు సాగుతూ ఉంటుంది. 

ఫస్ట్ హాఫ్‌లో అయితే కథ చాలా నెమ్మదిగానే ఉంది. కానీ ఒక విధంగా రవితేజ కెరీర్ లో ఇది ఒక కొత్త తరహా సినిమా అని చెప్పవచ్చు. ఒక ప్రధాన హత్య కథాంశంతో దర్శకుడు ప్రేక్షకులను ఆకట్టుకోవాలిని ప్రయత్నం చేశాడు గాని ట్విస్ట్ లో పెద్దగా మ్యాటర్ లేకపోవడంతో రొటీన్ గానే అనిపిస్తుంది. ఇక కమర్షియల్ గా ప్రేక్షకులను ఆకర్షించడానికి కథలోని పాటలు అనవసరంగా ఇరికించినట్లు అనిపిస్తుంది. 

పాటలను అధిక బడ్జెట్‌తో  విదేశీ లొకేషన్‌లలో చిత్రీకరించారు. కానీ సినిమా మేకింగ్ కు ఆ పాటలకు పొంతన లేదు. కొన్ని సమయాల్లో కథ కంటెంట్ కు తగ్గట్టుగా వెళ్లినట్లు అనిపించింది కానీ మాస్ స్టార్‌ రవితేజ రేంజ్ కు మాత్రం సరితూగలేదనే చెప్పాలి. ఇక మిగిలిన సపోర్ట్ క్యారెక్టర్స్ నరేష్, పవిత్రా లోకేష్, తనికెళ్ల భరణి, నాసర్, రాహుల్ రామకృష్ణ పాత్రలు కథలో బాగానే ఇమిడి ఉన్నాయి. కానీ హీరోయిన్స్ క్యారెక్టర్స్ మాత్రం కథకు ఏమాత్రం సెట్టవ్వలేదు. మొత్తంగా యాక్షన్ కొరియోగ్రఫీ బాగుంది. ఫైట్స్ ఆడియెన్స్ ను మెప్పిస్తాయి. అలాగే చివరలో క్లయిమాక్స్ ఓకే గా అనిపిస్తుంది. 

ప్లస్ పాయింట్స్ 
👉ఫైట్స్
👉సెకండ్ ఆఫ్ క్లైమాక్స్

మైనస్ పాయింట్స్
👉మ్యూజిక్
👉అవసరం లేని కొన్ని పాత్రలు
👉స్క్రీన్ ప్లే

రేటింగ్: 2.25/5

Post a Comment

Previous Post Next Post