Pakka Commercial - Review & Rating


కథ:
ఒక ఆత్మహత్యకు సంబంధించిన కేసులో సత్యారాజ్ ఇచ్చిన తీర్పు అతనికి ఏ మాత్రం సంతృప్తినివ్వదు. దీంతో న్యాయమూర్తిగా బాధ్యత నుంచి తప్పుకొని లాయర్ గా మారతాడు. ఇక మరోవైపు గోపిచంద్ వారసుడిగా లాయర్ అవుతాడు కానీ విలువలను పక్కన పెట్టి కమర్షియల్ గా మారతాడు. ఇక గతంలో జరిగిన ఆత్మహత్య కేసులో నిందితుడి కోసం కొడుకు, న్యాయం కోసం సత్యరాజ్ ఎలాంటి దారిలో వెళతారు అనే తరహాలో కోర్ట్ డ్రామా కొనసాగుతుంది. ఇక గోపిచంద్ మధ్యలో ఎదుర్కొన్న సమస్యలు ఏమిటి అతను ఎలా మంచి వాడిగా మారాడు?  న్యాయం కోసం ఏం చేశాడు అనేది మిగతా కథ. 


విశ్లేషణ:
దర్శకుడు మారుతి కథ కంటే కూడా కథనం విషయంలో జాగ్రత్తలు తీసుకొని సక్సెస్ కొట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి. చిన్న లైన్ తో కామెడీ ఎంటర్టైనర్ ను తీసుకురాగల మారుతి ఈసారి కాస్త భిన్నంగా గోపిచంద్ లాంటి మాస్ హీరోతో మాస్ యాక్షన్ యాంగిల్ ను కూడా టచ్ చేశాడు. అయితే కథనం విషయంలో మాత్రం మారుతి పెద్దగా ఎట్రాక్ట్ చేయలేకపోయాడు. ఆడియెన్స్ ఉహాలకందని సన్నివేశాలు అయితే ఇందులో ఏమి లేవు. ఫస్ట్ హాఫ్ లో అలా కామెడీగా ఆడియెన్స్ ను రిలాక్స్ గా నవ్వుకునేలా చేసిన మారుతి సెకండ్ హాఫ్ లో కోర్ట్ డ్రామాను మరింత హైలెట్ చేశాడు.

మొదట్లోనే రావు రమేష్, సత్యరాజ్‌లకు సంబంధించిన  ఓపెనింగ్ ఎపిసోడ్స్ తోనే సినిమా ఎటువైపు దారి తీస్తుందో, ఎలా ముగుస్తుందో ముందే ఉహించవచ్చు. ఇక ప్రతీ క్యారెక్టర్ ను ఫస్ట్ హాఫ్ లో కామెడీగా హైలెట్ చేసే ప్రయత్నం బాగానే చేశారు. ముఖ్యంగా గోపిచంద్ ఎంట్రీతో పాటు కొంతమంది కమెడియన్స్ క్యారెక్టర్లు బాగానే వర్కౌట్ అయ్యాయి. ముఖ్యంగా రావు రమేష్ సీన్స్ విభిన్నంగా ఉన్నాయి.

అయితే రాశి ఖన్నా ట్రాక్ మాత్రం అంత కొత్తగా ఏమి అనిపించదు. ఆమె లాయర్ క్యారెక్టర్ జాతిరత్నాలు హీరోయిన్ ను గుర్తు చేసింది. ఆమె కామెడీ సీన్స్ ను ఆడియెన్స్ ఏమి అంతగా ఎంజాయ్ చేసే అవకాశం లేదు. కానీ సప్తగిరి మాత్రం సైడ్ లో తన పాత్రకు న్యాయం చేశాడు. కానీ అక్కడక్కడ రోటీన్ సీన్స్ అతన్ని కూడా తగ్గిస్తాయి. కామెడీ అయితే ఊహించినట్లుగా వర్కవుట్ కాలేదు. చాలా వరకు ఫ్లాట్‌గా కొనసాగుతుంది. అక్కడక్కడా కొన్ని సీన్స్ మాత్రమే హైలెట్ అయ్యాయి. సెకండ్ హాఫ్ లో గోపిచంద్ మార్క్ కి తగ్గట్టుగా యాక్షన్ సన్నివేశాలు అయితే పరవాలేదు. కానీ విలన్స్ తో చేసే కామెడీ రొటీన్ రొట్ట గానే ఉంటుంది.

ఇంటర్వెల్ మార్క్ వద్ద కథ కాస్త రొటీన్ గానే ట్విస్ట్ ఇస్తుంది. సెకండ్ హాఫ్‌లో కథను కూడా రొటీన్ ఫార్ములా లానే ఉంటుంది. ఇక తండ్రీ కొడుకుల ఎమోషనల్ ట్రాక్‌ అంత గా కనెక్ట్ అయ్యేలా లేకపోవడం కూడా కథనాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఎన్నో పరిణామాల అనంతరం ఎమోషనల్ సీన్స్ చివరలో బలవంతంగా చూడాల్సి వస్తుంది. ఇక కొన్ని సెటైరికల్ డైలాగ్స్‌తో ముగింపు బాగానే ఉంది. కానీ అప్పటికి ఆసక్తి తగ్గిపోతుంది. ఇక సినిమాకు మరో పెద్ద మైనస్ మ్యూజిక్. JB ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా పెద్దగా వర్కౌట్ కాలేదు. ఫైనల్ గా పక్కా కమర్షియల్ చాలా రొటీన్ ప్లాట్‌తో కొనసాగుతుంది.  కేవలం అక్కడక్కడ కొన్ని వినోదాత్మక బిట్‌లతో విలక్షణమైన ఎంటర్‌టైనర్‌ గా సినిమా హైలెట్ అయ్యింది. పెద్దగా అంచనాలు లేకుండా వెళితే సినిమాను ఒకసారి చూసి ఎంజాయ్ చేయవచ్చు.

ప్లస్ పాయింట్స్:
👉హీరో క్యారెక్టర్
👉కొన్ని కామెడీ యాక్షన్ సీన్స్

మైనస్ పాయింట్స్:
👉రొటీన్ కథ, కథనం
👉మ్యూజిక్
👉సెకండ్ హాఫ్ ఎమోషనల్ సీన్స్

రేటింగ్: 2.5/5

Post a Comment

Previous Post Next Post