ఒక్క సినిమా ఎంతమందిని ప్రభావితం చేస్తుందో ఇటీవల డిజాస్టర్ అయిన ఆచార్య సినిమాతో అర్థమైంది. ఒకవైపు కొరటాల శివ తీవ్రస్థాయిలో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాడు. మరొకవైపు దిని వల్ల జూనియర్ ఎన్టీఆర్ తో స్టార్ట్ అవ్వాల్సిన నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా ఆలస్యమవుతుంది, ఎందుకంటే కొరటాల ఆచర్య బయ్యర్స్ ఒత్తిడిలో ఉండడం తో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ పైన ఫోకస్ చేయలేకపోతున్నాడు.
ఆచార్య తీవ్రంగా నష్టాలు కలుగచేయడంతో కొరటాల హైదరాబాదులోనే 40 కోట్ల విలువైన ఒక స్థలం కూడా అమ్మేసినట్లు తెలుస్తోంది. ఎక్కువగా ఆచార్య సినిమా బిజినెస్ వ్యవహారాలలో తల దూర్చిన కొరటాలకు ఆచార్య ఊహించని దెబ్బ కొట్టింది. ఇక ఈ తరుణంలో తన తదుపరి సినిమా షెడ్యూల్స్ విషయంలో కూడా కొరటాల స్వేచ్ఛగా వర్క్ చేయలేని పరిస్థితి ఏర్పడింది. నెల రోజులుగా ఆచార్య బయ్యర్లతో చర్చలు జరపడమే కొనసాగుతోంది. అయితే ఎన్టీఆర్ 30వ సినిమాను ఈ నెలలోనే మొదలుపెట్టాల్సింది. కానీ ఇప్పుడు ఆగస్టుకు షిఫ్ట్ చేశారు. అప్పటిలోపు కొరటాల ఈ సమస్యల నుంచి బయటపడితే ప్రశాంతంగా ప్రాజెక్టును మొదలుపెట్టే అవకాశం ఉంటుంది.
Follow
Post a Comment