NTR 30 ఆలస్యంపై కళ్యాణ్ రామ్ క్లారిటీ!


జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో ఎన్టీఆర్ 30వ సినిమా తెరపైకి రాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా అనౌన్స్ చేసి చాలా కాలమైనప్పటికీ కూడా ఇంకా షూటింగ్ మొదలవలేదు. ఇక అసలు సమస్య ఏమిటి అనే విషయంలో అనేక రకాల రూమర్స్ అయితే ఫ్యాన్స్ ను కన్ఫ్యూజన్ కు గురిచేస్తున్నాయి. ఇక ఈ తరుణంలో కళ్యాణ్ రామ్ తన వైపు నుంచి ఒక క్లారిటీ ఇచ్చాడు. ఈ సినిమాను కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ పై నిర్మిస్తున్న విషయం తెలిసిందే.

జూనియర్ ఎన్టీఆర్ RRR సినిమాతో భారీ స్థాయిలో సక్సెస్ అందుకోవడం వలన ఆ తర్వాత రాబోయే సినిమా ఎంతో బాధ్యతగా తెరపైకి తీసుకురావాలి కాబట్టి చాలా ఒత్తిడి ఉంటుంది. అందుకే ఆ సినిమా విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని కానీ తప్పకుండా మంచి అవుట్ పుట్  ఇవ్వడానికే ప్రణాళికలు రచిస్తున్నట్లుగా చెప్పారు. అసలు కారణం కళ్యాణ్ రామ్ చెప్పలేదు కానీ ఇంకా కొన్ని చర్చలు అనంతరం సినిమా షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉన్నట్లు ఒక హింట్ అయితే ఇచ్చారు. అంటే సినిమా పర్ఫెక్ట్ ప్లానింగ్ తోనే మొదలుపెట్టాలి అని ఎన్టీఆర్ కొరటాల శివ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

Post a Comment

Previous Post Next Post