కథ:
ఈ సినిమా తుపాకీలను బహిరంగంగా అనుమతించే ఊహా ప్రపంచం నేపథ్యంలో ఈ సాగుతుంది. అలాంటి సమయంలో, హ్యాపీ(లావణ్య త్రిపాఠి) సర్ ప్రైజ్ పార్టీ కోసం పోష్ పబ్‌కి వెళుతుంది. ఈ క్రమంలో వజ్రాల దోపిడీకి సంబంధించిన ప్లాన్ కోసం కొన్ని పాత్రలు ఎంట్రీ ఇస్తాయి. అసలు బర్త్ డే కు అక్కడ దోపిడీకి సంబంధం ఏమిటి? ఈ పిచ్చి మనుషులెవరు? అలాగే హ్యాపీ కథ ఏమిటి? అనే సింపుల్ పాయింట్ కథ కొనసాగుతుంది.
విశ్లేషణ:
సర్రియల్ కామెడీ జానర్ అనే తరహాలో మత్తు వదలరా దర్శకుడు రితేష్ రానా తెరపైకి తీసుకు వచ్చిన హ్యాపీ బర్త్ డే సినిమా కాన్సెప్ట్ చాలా కొత్తదే. అయితే ఎంత కొత్తగా ఉన్నా కూడా ఆడియేన్స్ కు నచ్చనంత కొత్తగా ఉంటే మాత్రం దాన్ని ఏమంటారో మీ ఉహాలకే వదిలేస్తున్నాం. చెత్తగా తీశాడా అని అనలేము. ఎందుకంటే ఇలాంటి ప్రయోగాత్మకమైన సినిమాలు రావాల్సి ఉంది. కాని అవి ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే విధంగా జాగ్రత్తగా తీస్తే బావుంటుంది. థియేటర్స్ కు ఈ రోజుల్లో ఆడియేన్స్ రావడమే చాలా కష్టంగా మారింది. ఇక ఇలాంటి ప్రయోగాలు బెడిసి కొడితే మరోసారి నమ్మడానికి కూడా ఆడియెన్స్ ఒప్పుకోరు.
అసలు హ్యాపీ బర్త్ డే విషయంలో దర్శకుడు మైండ్ గేమ్ తో కాకుండా సర్రియల్ కామెడీ టైప్ లో వెళ్ళాలని అనుకున్న విధానం బాగానే ఉన్నా సీన్స్ పెద్దగా వర్కౌట్ కాకపోవడం అతిపెద్ద మైనస్. జాతిరత్నాలు లాంటి సినిమాల విషయంలో ఆడియేన్స్ కూడా పెద్దగా అంచనాలు పెట్టుకోకుండా వెళ్లి నవ్వుకుంటూ బయటకు వచ్చేశారు. అక్కడ యాక్టర్స్ అలాగే డైరెక్టర్ మేకింగ్ కామెడీ ఎపిసోడ్స్ బాగా వచ్చాయి. కానీ హ్యాపి బర్త్ డే సినిమా విషయంలో ఎక్కడ కూడా సీన్స్ వర్కౌట్ అయ్యింది లేదు. అక్కడక్కడా సత్య కామెడీ పాత్ర బాగానే ఉన్నా మిగతా జబర్దస్త్ శ్రీను, అలాగే మరికొందరు క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎందుకు ఉన్నారో అర్థం కాదు.
లావణ్య త్రిపాఠి పాత్ర ఎవరు చేసినా పెద్దగా కొత్తగా ఏమి ఉండదు. ఇక వెన్నెల కిషోర్ మరోసారి రొటీన్ గానే హైలెట్ అయ్యాడు. ఇంటర్వెల్ లో ఎదో బ్యాంగ్ ఇచ్చామని బిల్డప్ ఇచ్చారు గాని అక్కడ కంటెంట్ ఏమి లేదు. పరమ రొట్ట సీన్స్ అయితే బోలెడు ఉన్నాయి. ఆరంభంలోనే ల్యాగ్ ఇంటర్వ్యూకు తలలు పట్టుకోవడం కాయం. అసలు ఈ సినిమా రాజమౌళికి నచ్చిందని చెప్పడం మరో పెద్ద మిస్టరీ. మత్తువధాలరా 'ఓరి నా కొడకా సీరియల్ క్యారెక్టర్స్' పై అంచనాలు పెంచుకుంటే ఇక అంతే. అవి కూడా పేలని చిచ్చు బుడ్డీలే. ఇక నేటితరం సోషల్ మీడియాలోని చాలా రకాల మీమ్స్ ట్రోల్స్ ను వాడుకొని సీన్స్ క్రియేట్ చేసిన విధానం బాగానే ఉంది. కానీ మేకింగ్ విధానం ఏ మాత్రం బాగోలేదు. కొన్ని చోట్ల ఎలివేషన్స్ కు కాల భైరవ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రమే బాగుంది. ఫైనల్ గా హ్యాపీ బర్త్ డే అంచనాలు పెంచి ఒక్కసారిగా నిరుగార్చేసింది. ఎక్కడ కూడా పగల బడి నవ్వే సీన్స్ ఆయితే లేవు. ఇక ఆడియెన్స్ ఈ సినిమాకి ఎంతవరకు ఎట్రాక్ట్ అవుతారో చూడాలి.
ప్లస్ పాయింట్స్:
డిఫరెంట్ కాన్సెప్ట్
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
మైనస్ పాయిమ్స్:
రోటీన్ సీన్స్
ఎడిటింగ్
అనవసరమైన పాత్రలు
రేటింగ్: 2/5
Post a Comment