DJ టిల్లు సీక్వెల్ విషయంలో గొడవ.. మరో డైరెక్టర్ ఫిక్స్?


సూపర్ హిట్ చిత్రం డీజే టిల్లుకు సీక్వెల్ రానున్నట్లు నెల రోజుల క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే. సిద్ధు జొన్నలగడ్డ మళ్లీ అదే తరహా ప్లానింగ్ తో దర్శకుడు విమల్‌కృష్ణ మినహా టీమ్‌ అంతా రెడీ అయ్యారు. అయితే షూట్ స్టార్ట్ చేసే క్రమంలో హఠాత్తుగా కొన్ని విభేదాల కారణంగా దర్శకుడు ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లు టాక్ వచ్చింది.

ఇక డీజే టిల్లు 2 సినిమాకు మరో దర్శకుడిని ఫైనల్ చేసినట్లుగా తెలుస్తోంది. గతంలో అద్బుతం, నరుడా డోనరుడా చిత్రాలకు దర్శకత్వం వహించిన మల్లిక్ రామ్ దర్శకత్వంలో డీజే టిల్లు 2 రూపొందనుందట. మరోవైపు ఆగస్టు మూడో వారంలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుందని ప్రచారం జరుగుతోంది.  అయితే మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరి డీజే టిల్లు 2 ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించనుండగా చిత్రానికి శ్రీచరణ్ పాకాల, రామ్ మిరియాల సంగీతం అందించనున్నారు.

Post a Comment

Previous Post Next Post