రామ్ పోతినేని నటించిన ది వారియర్ సినిమా గురువారం రోజు గ్రాండ్ గా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. మరికొన్ని గంటల్లో ఓవర్సీస్ లో కూడా ప్రీమియర్స్ తో సినిమా సందడి మొదలు కానుంది. తప్పకుండా ఈ సినిమా ఓపెనింగ్స్ తోనే బాక్సాఫీస్ వద్ద పెట్టిన పెట్టుబడులు వెనక్కి తీసుకు రావాల్సి ఉంటుంది.
ఒకవైపు టికెట్ల రేట్లు ఎక్కువగా ఉండడం వర్షాలు కురుస్తూ ఉండడంతో ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో అనే అనుమానాలు వస్తున్నాయి. ఇక ది వారియర్ నిర్మాతలు పెద్దగా రిస్క్ తీసుకోకుండా చాలా ఫాస్ట్ గానే ఓటీటీ లో విడుదల చేసేందుకు ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ముందుగా చేసుకున్న డీల్ ప్రకారం 4 వారాల్లోనే ఓటీటీ లోనే విడుదల చేయవచ్చని టాక్. అయితే ఏ సంస్థ ఓటీటీ హక్కులను దక్కించుకుంది అనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు.
Follow
Post a Comment