ఆ హీరో సినిమా చేస్తే మొత్తం కామెడీ అవుతుంది అని దర్శకులు కూడా తెలుసు అందుకే తెలియకుండానే సెటైరికల్ గా అతనితో సీరియస్ సినిమా చేసి జనాలను థియేటర్ల కు రప్పిస్తున్నారు. అతను మరెవరో కాదు తమిళనాడులో అత్యంత ధనవంతుల్లో ఒకరైన శరవణ స్టోర్స్ అధినేత శరవణన్. సొంతం ప్రొడక్షన్ లోనే అతను చేసిన ది లెజెండ్ సినిమా పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా విడుదలైంది.
అప్పట్లో సంపూర్ణేష్ బాబుని చూసి అసలు ఇతని హీరో ఏంటి అని చాలా రకాల కామెంట్స్ అయితే వచ్చాయి. కానీ దర్శకుడు సాయి రాజేష్ అదే తరహా ఆలోచనతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ వచ్చేలా సినిమాను తెరపైకి తీసుకువచ్చాడు. హృదయ కాలేయం సినిమాలో ఎలాగైతే సైంటిస్ట్ గా సంపు కనిపించాడో అలాగే తమిళంలో కూడా ఇటీవల శరవనన్ అనే ఒక హీరో షుగర్ వ్యాధికి మందు కనిపెడుతున్నట్టు మరొక సైంటిస్ట్ గా కనిపించాడు.
ఒక విధంగా అతను ది లీజెండ్ అనే ఆ సినిమాలో సీరియస్ గానే నటించాడు. భారీ బడ్జెట్ తో వచ్చిన సినిమా యాక్షన్ సన్నివేశాలు అలాగే ఎమోషనల్ సీన్స్ కూడా బాగానే హైలైట్ అయ్యాయి. అలాగే ఉన్నతమైన క్యాస్ట్ తో కూడా బడ్జెట్ ఎక్కువైంది. అతను తమిళనాడులోని అత్యంత ధనవంతుల్లో ఒకరైన బిజినెస్ మాగ్నెట్ కావడంతో బడ్జెట్ అయితే ఏమాత్రం తక్కువ కాకుండా చూసుకున్నారు. ఇక సినిమా ట్రొలింగ్ కి ఎక్కువగా గురైనప్పటికీ కూడా తమిళనాడు లో అయితే ఓ వర్గం వారు సినిమాను చూసేందుకు ఎగ బడుతున్నారు. మరి ఈ సినిమా మొత్తం ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.
Follow
Post a Comment