బింబిసార కోసం కీరవాణి రెమ్యునరేషన్ ఎంతంటే?


RRR సినిమాతో మరో లెవెల్ కు వెళ్లిన MM కీరవాణి అత్యధిక రెమ్యునరేషన్ అందుకున్న నెంబర్ వన్ ఇండియన్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో ఒకరిగా నిలిచారు. అయితే ఆయన ఇప్పుడు బింబిసార సినిమాకు ఎంత తీసుకున్నారు అనేది హాట్ టాపిక్ గా మారింది. నిజానికి అసలు ఈ ప్రాజెక్ట్ అనుకున్నప్పుడు చిరంతన్ భట్ ను మ్యూజిక్ డైరెక్టర్ గా అనుకున్నారు. 

కానీ అతను బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ విషయంలో అనుకున్నంతగా మెప్పించలేదు. అలాగే సాంగ్స్ కూడా అంతగా హైప్ తీసుకువచ్చేలా లేవని ఎన్టీఆర్ ఇచ్చిన సలహా మేరకు ఎమ్ఎమ్.కీరవాణిని అనుకున్నారు. ఎన్టీఆర్ అంటే ఎంతో ఇష్టపడే కీరవాణి అతని మాటకు రెమ్యునరేషన్ కూడా పెద్దగా డిమాండ్ చేయకుండా.. తన మార్కెట్ వాల్యూకు తగ్గట్టుగా కాకుండా 1.75 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. కీరవాణి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకు ఆయువు పట్టుగా నిలిచినట్లు తెలుస్తోంది.

Post a Comment

Previous Post Next Post