ఆచార్య.. అసలు కొరటాల ఎలా ఇరుక్కున్నాడంటే?


ఇటీవల ఆచార్య సినిమా డిజాస్టర్ కావడంతో ఆ భారం అంతా కూడా డైరెక్టర్ కొరటాల శివపైన ఎక్కువగా పడింది. అయితే ప్రముఖ నిర్మాత నిరంజన్ రెడ్డి అలాగే మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ లాంటి ఇద్దరు స్టార్ హీరోలు ఉండగా కేవలం కొరటాల శివ పైన ఎందుకు ఈ భారం పడింది అనే విషయంలో అనేక రకాల సందేహాలు వినబడుతున్నాయి. ఇక అసలు సంగతి ఏమిటి అనే వివరాల్లోకి వెళితే..

ఆచార్య సినిమాకు నిరంజన్ రెడ్డి నిర్మాత అయినప్పటికీ కూడా సినిమా బిజినెస్ వ్యవహారాల్లో పూర్తిగా కొరటాల శివ ఆధిపత్యం చూపించాడు. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం కొరటాల శివ రెమ్యునరేషన్ తీసుకోకుండా లాభాల్లో వాటా అందుకునే విధంగా మాట్లాడుకున్నాడు. అంతే కాకుండా బిజినెస్ వ్యవహారం కూడా తన ఆధీనంలోకి తీసుకొని మరొక డీల్ సెట్ చేసుకున్నాడు. 

సినిమా మొత్తం ఫ్రీ రిలీజ్ బిజినెస్ లో కొరటాల శివ అందులో వచ్చిన లాభాలను నిర్మాతతో కలిసి షేర్ చేసుకోవాలని అనుకున్నాడు. ఇక అదే తరహాలో రేట్లను నిర్ణయించిన కొరటాల ఊహించని విధంగా సినిమా డిజాస్టర్ కావడంతో ఇప్పుడు దాదాపు 40 కోట్ల వరకు బయ్యర్లకు తిరిగి ఇచ్చేందుకు హైదరాబాదులో ఉన్న ఒక ఖరీదైన స్థలాన్ని కూడా అమ్మకానికి పెట్టినట్లు సమాచారం.

Post a Comment

Previous Post Next Post