ప్రతీ పండక్కి ఓ మెగాస్టార్ సినిమా!


మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమానంతరం ఎలాగైనా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవాలని ప్రస్తుతం లూసిఫర్ సినిమాను రెడీ చేస్తున్నాడు. ఈ సినిమా విజయదశమి కనుక రాబోతున్నట్లు ఇటీవల ఫస్ట్ లుక్ టీజర్ తో క్లారిటీ ఇచ్చారు. అయితే ఆ తర్వాత సంక్రాంతికి బోళా శంకర్ సినిమా వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ సినిమాకు మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.

ఇక లిస్టులో ఉన్న వాల్తేరు వీరయ్య సినిమా ఉగాది పండుగ సమయంలో విడుదల కానున్నట్లు సమాచారం. ఈ సినిమాకు బాబి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రతి పండుగకు మెగాస్టార్ చిరంజీవి నుంచి ఒక సినిమా అయితే పక్కగా రానుందని సమాచారం. అయితే సినిమాల రిలీజ్ ప్లాన్ అయితే బాగానే ఉంది కానీ వాటిపై ప్రస్తుతం పెద్దగా హైప్ చేసేంత వార్తలు ఏమి రావడం లేదు. మెగాస్టార్ నుంచి మరింత కొత్తదనం కోరుకుంటున్న ఆడియన్స్ ఈ కమర్షియల్ సినిమాలను ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు అనేది సందేహంగానే ఉంది. ఎందుకంటే ఇటీవల వచ్చిన మెగా మల్టీస్టారర్ ఆచార్య ఎలాంటి రిజల్ట్ ను అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

Post a Comment

Previous Post Next Post