త్రివిక్రమ్ కు మహేష్ టార్చర్?


సినిమా విషయంలో మహేష్ బాబు ఇటీవల కాలంలో ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వడం లేదు అని చెప్పాలి. బ్రహ్మోత్సవం సినిమా తర్వాత ఆయన ఎలాంటి దర్శకుడు సినిమా చేయడానికి వచ్చిన కూడా పూర్తి బౌండ్ స్క్రిప్ట్ సిద్ధం చేస్తే గాని సినిమా స్టార్ట్ చేయడానికి ఆసక్తిని చూపించడం లేదు. ఇక త్రివిక్రమ్ విషయంలో కూడా అదే తరహాలో చాలా  బలమైన నిర్ణయంతోనే ముందుకు వెళుతున్నాడు. అయితే ఇప్పటికే మూడుసార్లు విదేశాలకు వెళ్లి వచ్చిన మహేష్ బాబు మరోసారి కూడా వెళ్లబోతున్నట్లు తెలుస్తోంది.

ఈ తరుణంలో త్రివిక్రమ్ ఇంకా ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేయకపోవడంతో మహేష్ మరోసారి అందులో కన్ఫ్యూజన్స్ ఉన్నాయి అని డౌట్స్ క్రియేట్ చేశాడట. దీంతో మళ్ళీ త్రివిక్రమ్ స్క్రిప్ట్ మార్చే పనిలో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఒక విధంగా మహేష్ బాబు క్లారిటీ కోసం ఆలోచిస్తూ ఉంటే త్రివిక్రమ్ మాత్రం ఈ ప్రాజెక్టును స్టార్ట్ చేయడానికి ఒక విధంగా టార్చర్ అనుభవిస్తున్నాడు అని చెప్పవచ్చు. ఎందుకంటే గత ఏడాదిలోనే ఈ సినిమా మొదలు పెట్టాలని అనుకున్నారు. కానీ ఇంతవరకు కనీసం మొదటి షెడ్యూల్ కు కూడా క్లాప్ పడలేదు. ఇలా అయితే సినిమా వచ్చే సమ్మర్ రావడం కూడా అనుమానమే అని తెలుస్తోంది.

Post a Comment

Previous Post Next Post