మెగా ఫ్యాన్స్ ను మెప్పించిన కళ్యాణ్ రామ్!


నిజానికి ఒకప్పుడు అభిమానుల మధ్యనే కాకుండా హీరోల మధ్య అభిప్రాయా బేధాలు చాలా ఉండేవి అనేది వాస్తవం. తెలియకుండానే హీరోలు చాలా పర్సనల్గా పోటీని తీసుకునేవారు. కానీ ఎక్కడైనా ఈవెంట్స్ లో కలుసుకుంటే మాత్రం చాలా నార్మల్గానే కనిపించేవారు. అయితే ఇప్పుడు మాత్రం అందుకు భిన్నంగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. అందరికి కూడా కాస్త ఉన్నతంగా ఆలోచించి ఉంటేనే మార్కెట్ వాల్యూ కూడా బాగుంటుంది అని అనుకుంటున్నారు.

ఇక బింబిసార సినిమా ఈవెంట్లో నందమూరి అభిమానుల సపోర్ట్ ఏ విధంగా ఉందో క్లారిటీ వచ్చేసింది. అయితే ఈ బిగ్ బడ్జెట్ సినిమాకి కేవలం నందమూరి అభిమానులు సపోర్ట్ మాత్రమే సరిపోదు. అన్ని వర్గాల ఆడియన్స్ చూస్తేనే ఈ సినిమా పెట్టిన పెట్టుబడి వెనక్కి తేగలదు. ఈ తరుణంలో కళ్యాణ్ రామ్ మెగా హీరో సినిమా పేరు ప్రస్తావించడం ఆ టాపిక్ గా మారిపోయింది.

ఎక్కువగా ఇతర హీరోల గురించి ఈవెంట్స్ లో మాట్లాడితే అక్కడ అభిమానులు తట్టుకోలేరు అని హీరోలకు కూడా తెలుసు. అందుకే మాటల్లో భాగంగా ఒక మంచి విషయాన్ని అయితే కళ్యాణ్ రామ్ చెప్పాడు. ఎన్నో పౌరాణిక సినిమాలో ఫాంటసీ సినిమాలు మా తాత గారితోనే మొదలయ్యాయి అంటూ ఆ తర్వాత బాలయ్య బాబాయ్ కూడా భైరవద్వీపం, ఇక చిరంజీవి గారు జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాతో కూడా చాలా మెప్పిన్చినట్లు కళ్యాణ్ రామ్ తెలియజేశాడు. 

ఈ ఒక్క మాటతో కళ్యాణ్ రామ్ కూడా అన్ని వర్గాల హీరోలతో చెలిమిగా ఉంటాడు అనే ఆలోచనను కలుగజేస్తోంది. ఏదేమైనా కళ్యాణ్ రామ్ ఎదో బిస్కెట్ వేసినట్లు హైప్ కోసం పొగడకుండా కేవలం మంచి విషయాన్ని ప్రస్తావిస్తూ మంచి మనసుతోనే మెగా ఫ్యాన్స్ ని మెప్పించడానీ చెప్పవచ్చు. ఇప్పటికే RRR తో ఎన్టీఆర్ కూడా మెగా ఫ్యాన్స్ కు బాగా దగ్గరయ్యాడు. ఇక బింబిసారకు కూడా అదే విధంగా జరగాలని కోరుకుందాం..

Post a Comment

Previous Post Next Post