చొక్కా విప్పిన బాలయ్య.. ఏం ఉన్నడ్రా బాబు!


నందమూరి బాలకృష్ణ అఖండ సినిమా సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఆ సినిమా సక్సెస్ అనంతరం మరో హై వోల్టేజ్ యాక్షన్ సినిమాతో కూడా సక్సెస్ అందుకోవాలి అని రెడీ అవుతున్నాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న బాలయ్య 107వ సినిమాపై అంచనాలైతే మామూలుగా లేవు. ఇక ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కర్నూలులో జరుగుతోంది.

ఇక అక్కడ బాలయ్య షూటింగ్స్ స్పాట్ లో ఎలాంటి కారావాన్ లేకుండా చాలా సాధారణంగా ఏదో పొలం పక్కన కూర్చున్నట్లుగా కనిపిస్తున్నాడు. షూటింగ్ గ్యాప్ లో బాలయ్య చొక్కా విప్పేసి లోపల బనిన్ కనిపించేలా ఫోన్ మాట్లాడుతున్న ఒక ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. బాలయ్య బాడీ లాంగ్వేజ్ లోనే ఊరమాస్ యాక్షన్ ఉంది అన్నట్లుగా అభిమానులు స్పందిస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న నేపథ్యంలో అక్కడికి చాలామంది అభిమానులు తరలివచ్చారు. ఇక వారిని కంట్రోల్ చేసేందుకు ప్రత్యేకంగా పోలీస్ బందోబస్తు కూడా నిర్వహించాల్సి వచ్చింది. ఇక ఈ సినిమాకు జై బాలయ్య అనే టైటిల్ను అనుకుంటున్న విషయం తెలిసిందే.

Post a Comment

Previous Post Next Post