భవదియుడు భగత్ సింగ్.. ఈసారి తేల్చాల్సిందే!


గబ్బర్ సింగ్ సినిమాతో రికార్డులను క్రియేట్ చేసిన దర్శకుడు హరీష్ శంకర్ మరోసారి పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇక మొత్తానికి మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో వీరి కలయికలో సినిమా రాబోతున్నట్లు గత ఏడాది ప్రకటించిన విషయం తెలిసిందే. భవదీయుడు భగత్ సింగ్ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు.

అయితే పవన్ కళ్యాణ్ మిగతా ప్రాజెక్టులతో అలాగే పాలిటిక్స్ లో బిజీగా ఉండడం వలన ఈ ప్రాజెక్టు మొదలు కావడానికి చాలా ఆలస్యం అవుతోంది. అసలు పవన్ కళ్యాణ్ ఈ సినిమాను చేసే ఆలోచనలో కూడా లేరు అని కథనాలు వచ్చాయి. ఇక ఇప్పుడు దర్శకుడు మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు మరొక రెండు రోజుల్లో పవన్ కళ్యాణ్ సుదీర్ఘంగా చర్చలు జరుపుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో ఏదో ఒక క్లారిటీకి రావడానికి పవన్ కళ్యాణ్ నుంచి వివరణ కొరనున్నారట. పవన్ వీలు కాదంటే హరీష్ మరో ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తాడని తెలుస్తోంది. మరి పవన్ కళ్యాణ్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

Post a Comment

Previous Post Next Post