ఆచార్య దెబ్బకు గాడ్ ఫాదర్ ట్రీట్మెంట్!


ఆచార్య సినిమాతో మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఆ సినిమాపై పెట్టిన పెట్టుబడికి కనీసం సగం కూడా వెనక్కి రాలేదు. 90 కోట్లకు పైగా నష్టాలు రావడంతో ఒక్కసారిగా షాక్ అయ్యారు. అయితే తదుపరి సినిమా విషయంలో మాత్రం అలా జరగకుండా మెగాస్టార్ జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

ఒక విధంగా ఆచార్య దెబ్బకు గాడ్ ఫాదర్ ట్రీట్మెంట్ అనే చెప్పాలి. మొత్తానికే ఫస్ట్ లుక్ టీజర్ అయితే బాగానే ఆకట్టుకుంది. ఇక నెక్స్ట్ సాంగ్స్ విషయంలో కూడా చాలా సీరియస్ నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు సమాచారం. ఆచార్య సినిమాకు మొదట సాంగ్స్ దగ్గరే దెబ్బ పడింది. ఆ సినిమాకు ఏ పాట కూడా అంతగా హైలెట్ కాలేదు కానీ యూట్యూబ్లో మాత్రం మిలియన్స్ వ్యూవ్స్ ఎలా వచ్చాయో ఎవరికీ అర్థం కాలేదు. కానీ ఇప్పుడు మ్యూజిక్ విషయంలో థమన్ పై బాగానే ఒత్తిడి పెంచుతున్నట్లు సమాచారం. అంతే కాకుండా నెక్స్ట్ మిగతా పాత్రలకు సంబంధించిన టీజర్స్ ను కూడా విడుదల చేయాలని చూస్తున్నారు. మరి గాడ్ ఫాదర్ దసరా భరిలో ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందో చూడాలి.


Post a Comment

Previous Post Next Post