ధనుష్ భార్య నుంచి విడిపోవడానికి కారణం ఒక ప్రముఖ హీరోయిన్ అని గతంలో ఒక టాక్ వైరల్ అయిన విషయం తెలిసిందే. సార్ సినిమాలో నటిస్తున్న సంయుక్తా మీనన్ తో ధనుష్ కు కూడా గొడవపడినట్లుగా అనేక రకాల వార్తలు వచ్చాయి. అయితే మొదట ధనుష్ తో గొడవకు వలన ఆ బ్యూటీ సినిమా షూట్ మొదలైనే రోజే వెళ్లిపోయిందని ఆ తర్వాత దర్శక నిర్మాతలు మళ్లీ మాట్లాడి సినిమాలో నటించే విధంగా ఒప్పించినట్లు కూడా టాప్ వచ్చింది.
అయితే రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలలో సంయుక్త ఆ పుకార్లకు చెక్ పెట్టేసింది ధనుష్ సార్ సినిమాలో నేను 17 రోజుల షెడ్యూల్లో పాల్గొన్నాను. అయితే ఎప్పుడూ కూడా ఆయనతో నాకు గొడవ పడే పరిస్థితి రాలేదు. చాలా చక్కగా షూటింగ్ పనులను పూర్తి చేసుకున్నాము. ఒక్క పాట తప్పితే నాకు సంబంధించిన షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తయింది అని సంయుక్త తెలియజేసింది. అలాగే తాను మహేష్ బాబు త్రివిక్రమ్ కలయికలో రానున్న తదుపరి సినిమా SSMB 28లో నటిస్తున్నట్లు వస్తున్న వార్తల్లో కూడా నిజం లేదు అని సంయుక్త తెలియజేసింది.
Follow
Post a Comment