కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార సినిమా విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఇక శుక్రవారం రోజు ఈ సినిమాకు సంబంధించిన హైదరాబాదులోని శిల్పకళా వేదికలో గ్రాండ్గా నిర్వహించారు. అయితే వేడుకలో ఒక అభిమాని మృతి చెందినట్లుగా ఉదయం నుంచి సోషల్ మీడియాలో టాక్ రాగా నిజమో కాదో అని ఫ్యాన్స్ కన్ఫ్యూజ్ అయ్యారు.
ఇక మొత్తానికి చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ఒక వివరణ ఇచ్చింది. వివరాల్లోకి వెళితే ఈ కార్యక్రమానికి హాజరైన నందమూరి అభిమాని పుట్ట సాయి కన్నుమూశారని అందుకు చింతిస్తున్నట్లుగా వివరణ ఇచ్చారు. కొంతమంది చెబుతున్న దాని ప్రకారం అతనికి ఫిట్స్ వచ్చిందని మరియు వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించారని, అక్కడ అతను చనిపోయినట్లు ప్రకటించారు.
Follow
Post a Comment