రానా లీడర్ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించిన ప్రియా ఆనంద్ అందరికి తెలిసే ఉంటుంది. రామ రామ కృష్ణ కృష్ణ, 180 వంటి సినిమాలతో కనిపించిన ఈ బ్యూటీ ఆ తరువాత ఎక్కువ కాలం తెలుగు ఇండస్ట్రీలో కొనసాగింది లేదు. ఎక్కువగా తమిళంలోనే సినిమాలు చేసింది. అయితే ప్రియా ఆనంద్ ఇటీవల ఎన్నో ఆరోపణలు ఎదుర్కొన్న నిత్యానంద స్వామిని పెళ్లి చేసుకోవాలని కామెంట్ చేసిన విధానం హాట్ టాపిక్ గా మారింది.
నిత్యానంద స్వామి గతంలో ఒక మాజీ హీరోయిన్ తో రొమాన్స్ చేస్తూ అడ్డంగా దొరికిపోయిన విషయం తెలిసిందే. అలాగే అత్యాచార ఆరోపణలు కూడా ఎదుర్కొన్నాడు. పలు కేసుల కారణంగా నిత్యానంద దేశం విడిచి సొంతంగా ఒక ఐల్యాండ్ కొనుగోలు చేసి అక్కడే స్థిరపడ్డారు. ఇక రీసెంట్ గా ప్రియా ఆనంద్ ఇచ్చిన ఇంటర్వ్యూలో నిత్యానందను పెళ్లి చేసుకుంటే చాలు.. తాను పేరు మార్చుకోవాల్సిన అవసరం లేదని కామెంట్ చేసింది. దీంతో ఆ కామెంట్స్ ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నెగిటివ్ కామెంట్స్ ఎక్కువగా రావడంతో ఎదో సరదాగా అన్నట్లు కూడా ఆమె వివరణ ఇచ్చింది.
Follow
Post a Comment