దుబాయ్ లో ప్రభాస్ కొత్త వ్యాపారం?


ప్రభాస్ పాన్ ఇండియా హీరోగా మారిన అనంతరం అతను పాన్ ఇండియా మార్కెట్ లో నెంబర్ వన్ హీరోగా మారిపోయాడు.  ఇప్పుడు ప్రభాస్ తన ఆదాయాన్ని సరైన రీతిలో పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏకంగా దుబాయ్‌లో హోటల్ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రభాస్ ప్లాన్ చేస్తున్నాడని, అందుకు సంబంధించిన ప్లాన్స్ కూడా జరుగుతున్నాయని సోషల్ మీడియాలో ఒక ప్రచారం జరుగుతోంది.

ఎక్కువ సమయం విదేశాల్లో ఉంటూ విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్న ప్రభాస్ రెమ్యునరేషన్ ద్వారా వచ్చిన తన డబ్బును పెట్టుబడిగా పెట్టేందుకు దుబాయ్‌ని ఎంచుకున్నట్లు గాసిప్‌లు వినిపిస్తున్నాయి. ఇది కేవలం ఊహాగానాలే అయినప్పటికీ ఈ వార్త వైరల్ గా మారింది. ఇక ప్రభాస్ సినిమాల విశయనికి వస్తే నిన్న హైదరాబాద్‌లో సలార్ యొక్క కీలక షెడ్యూల్‌ను ముగించాడు. అలాగే మరోవైపు ప్రాజెక్ట్ కె సెట్స్ పై ఉండగా ఆదిపురుష్ వచ్చే సంక్రాంతికి విడుదలకు సిద్ధం కానుంది.

Post a Comment

Previous Post Next Post