రామ్.. ఇదే! తగ్గించుకుంటే మంచిది?


రామ్ పోతినేని నటించిన దివారియర్ సినిమా మొత్తానికి బాక్సాఫీస్ వద్ద దారుణమైన ఫలితాన్ని అందుకునేలా కనిపిస్తోంది  ఒక విధంగా తన కెరీర్ మొత్తంలో అత్యధిక నష్టాలను కలిగించిన సినిమాగా కూడా నిలవబోతున్నట్లు తెలుస్తోంది. ది వారియర్ సినిమా ఫైనల్ గా 15 కోట్ల నష్టాలను కలిగించవచ్చనీ ప్రస్తుత కలెక్షన్స్ చూస్తూనే అర్థమవుతుంది.

నిజంగా రామ్ లింగస్వామి తో ప్రాజెక్ట్ చేయడమే పెద్ద రిస్క్ అని చెప్పవచ్చు. ఇస్మార్ట్ శంకర్ సినిమా ఏదో మాస్ మానియాలో ఆడిపోయింది కానీ అదేమీ అంతా పూరి మార్కును తలపించే సినిమా కాదు అని కామెంట్స్ కూడా చాలానే వచ్చాయి. కానీ రామ్ ఆ సినిమా మీద నమ్మకంతో ది వారియార్ సినిమాను భారీ స్థాయిలోనే తీసుకువచ్చే ప్రయత్నం చేశాడు. కానీ తమిళంలో లింగస్వామి వరుస అపజయాలతో పట్టు కోల్పోయాడు. 

అక్కడ ఐదు కోట్ల బిజినెస్ చేసిన ది వారియర్ సినిమా కనీసం పెట్టిన పెట్టుబడిలో సగం కూడా వెనక్కి తెలేని పరిస్థితి. నష్టాలు ఎదుర్కోవడమే కాకుండా రామ్ ఎప్పటి నుంచో తమిళంలో చేయాలనుకుంటున్నా కోరిక కూడా నీరుగారిపోయింది. ఇక నెక్స్ట్ బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో ఫ్యాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. 

ఒక విధంగా బోయపాటి మాస్ కమర్షియల్ సినిమాలను గట్టిగానే ప్రజెంట్ చేస్తాడు. కానీ రామ్ తో కాంబినేషన్ ఎలా సెట్ అవుతుంది అనేది ఊహలకు అందని రేంజ్ లో ఉంది. అనవసరంగా రామ్ తన రేంజ్ ను మాస్ లో ఎక్కువగా ఊహించుకొని ప్రయోగాలు చేస్తున్నట్లు కొన్ని కామెంట్స్ అయితే వస్తున్నాయి. రామ్ హ్యాపీగా తెలుగులోనే ముందు నటుడిగా ప్రయోగాత్మకమైన సినిమాలు చేసి ఆ తర్వాత అటువైపుగా వెళ్తే బాగుంటుందేమో అనే సలహాలు కూడా వస్తున్నాయి. మరి రామ్ ది వారియర్ డిజాస్టర్ ను మరిపించేలా తర్వాత సినిమాతో మెప్పిస్తాడో లేదో చూడాలి.

Post a Comment

Previous Post Next Post