దర్శక దీరుడు రాజమౌళి తన తదుపరి సినిమాను టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తో చేయబోతున్న విషయం తెలిసిందే. బిగ్గెస్ట్ పాన్ ఇండియా అడ్వెంచర్ మూవీగా రానున్న ఆ సినిమా కోసం ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలయ్యాయి. ఇటీవల ఫ్రాన్స్ కు చెందిన ఒక విఎఫ్ఎక్స్ కంపెనీ తో సినిమా కోసం డీలింగ్ కూడా మాట్లాడుకున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన కథ అయితే సిద్ధమైంది.
ఇక దర్శకుడు రాజమౌళి ఈ సినిమాలో మరొక ముఖ్యమైన పాత్ర కోసం మంచి ఇమేజ్ ఉన్న ఒక యువ హీరోను సంప్రదించాలని అనుకుంటున్నాడట. రచయిత విజేంద్రయేంద్రప్రసాద్ ఆలోచన ప్రకారం నాని అయితే బాగుంటాడు అని కూడా చర్చల్లోకి వచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే ఇంకా రాజమౌళి మాత్రం ఆ విషయంలో ఎలాంటి ఫైనల్ నిర్ణయం తీసుకోలేదట. ఒకవేళ నానిని సంప్రదిస్తే మాత్రం అతను తప్పకుండా ఒప్పుకుంటాడు అని చెప్పవచ్చు. గతంలో నాని ఈగ సక్సెస్ అనంతరం రాజమౌళి ఎప్పుడు ఎలాంటి పాత్ర ఇచ్చిన కూడా ఏ సినిమాలో అయినా సరే చేస్తాను అని తెలియజేశాడు.
Follow @TBO_Updates
Post a Comment