త్రివిక్రమ్ తర్వాత సినిమాను మహేష్ బాబుతో స్టార్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇక ఆగస్ట్ ద్వితీయార్థంలో షూటింగ్ ప్రారంభించి, ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా ఫినిష్ చేయాలని ఫిక్స్ అయ్యారు. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుండగా, సెకండ్ హీరోయిన్ ని ఫైనల్ చేయలేదు. ఇప్పటికే త్రివిక్రమ్ ఆ పాత్ర కోసం చాలా మంది హీరోయిన్లను సంప్రదించారు. కానీ ఇప్పటి వరకు ఎవరు సెట్ కాలేదు.
మొదట త్రివిక్రమ్ టీమ్ శ్రీలీల, నభా నటేష్ అలాగే నిధి అగర్వాల్‌లను సంప్రదించారు. కానీ వారందరూ ఈ పెద్ద సినిమా ఆఫర్‌ను తిరస్కరించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే సెకండ్ హీరోయిన్ పాత్రలో అంతగా బలమైన స్కోప్ లేకపోవడంతో అందుకే రిజెక్ట్ చేశారన్న టాక్ వస్తోంది. త్రివిక్రమ్ ప్రతీ సినిమాలో దాదాపు ఎవరో ఒక సెకండ్ హీరోయిన్ గ్లామరస్ యాంగిల్ లో మెప్పిస్తూ కథలో కీలకం అవుతున్నారు. కానీ మేయిన్ హీరోయిన్ పాత్రలతో పోలిస్తే సెకండ్ హీరోయిన్ క్యారెక్టర్ అంతగా వర్కౌయ్ అవదు. మరి SSMB28 లో సెకండ్ హీరోయిన్ క్యారెక్టర్ లో ఎవరు కనిపిస్తారో చూడాలి.
Follow
Post a Comment