బింబిసార బడ్జెట్ అంతే అన్నమాట!


కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార సినిమా ఆగస్టు 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలోనే విడుదల కాబోతోంది. ఒక విధంగా కళ్యాణ్ రామ్ సినిమా కెరీర్ మొత్తంలోనే ఇది అత్యధిక భారీ బడ్జెట్ తో రూపొందింది. అయితే ఈ సినిమా బడ్జెట్ ఎంత అనే విషయంలో అనేక రకాల కామెంట్స్ అయితే వినిపించాయి. 

ఇక రీసెంట్గా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో కెమెరామెన్ చోటా కె నాయుడు చెప్పిన విషయాన్ని బట్టి సినిమా బడ్జెట్ 40 నుంచి 50 కోట్ల మధ్యలో అయిందని తెలుస్తోంది. ఆయన నిర్మాత హరి గురించి చెబుతూ ఈ సినిమా బడ్జెట్ మొత్తం 40 , 50 కోట్లు వరకు తెరపై కనిపిస్తుంది అని నిర్మాత ఆ విధంగా హార్డ్ వర్క్ చేసినట్లు చెప్పడంతో భారీ స్థాయిలోనే పెట్టుబడి పెట్టినట్లుగా అర్థమవుతుంది. ఇక నిర్మాత పేరు హరి అయినప్పటికీ కూడా ఎన్టీఆర్ ఆర్ట్స్ లో కళ్యాణ్ రామ్ చాలా వరకు పెట్టుబడి పెట్టినట్లుగా తెలుస్తోంది. మరి సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో ప్రాఫిట్స్ అందిస్తుందో చూడాలి.

Post a Comment

Previous Post Next Post