చిన్న స్టోరీ పాయింట్ తో మంచి ఎంటర్టైన్మెంట్ ను క్రియేట్ చేసి బాక్స్ ఆఫీస్ వద్ద భారీ స్థాయిలో లాభాలను అందించిన అతి కొద్ది మంది దర్శకులలో మారుతి ఒకరు. బడ్జెట్ విషయంలో ఈ దర్శకుడు తీసుకునే జాగ్రత్తలు అంతా ఇంతా కాదు. చాలా వరకు నిర్మాతలపై ఎక్కువగా భారం పడకుండా చూసుకుంటూ ఉంటాడు. ఇక ఇటీవల మాత్రం అతని ప్రణాళికలు పెద్దగా సక్సెస్ కావడం లేదు.
ప్రతిరోజు పండగే సినిమా తర్వాత 'మంచి రోజులు వచ్చాయి' సినిమా తేడా కొట్టేసింది. ఆ తర్వాత 'పక్కా కమర్షియల్' సినిమా కూడా దాదాపు ప్లాప్ లిస్టులో చేరిపోయింది. అయితే ఇప్పుడు మారుతి పెద్ద హీరోలతో సినిమాలు చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. ఈ క్రమంలో అతను తన సినీ జీవితంలో పెట్టిన పెట్టుబడికి అత్యధిక లాభాలను అందించిన సినిమాకు కూడా సీక్వెల్ తీసుకురాబోతున్నాడట. ఆ సినిమా మరేదో కాదు 'బలే బలే మగాడివోయ్' సినిమాకు సీక్వెల్ అని తెలుస్తోంది. 2015 లో వచ్చిన సినిమా నాని సినీ జీవితాన్ని మరో స్థాయికి తీసుకువెళ్ళింది. మరి ఆ సినిమాకు ఎలాంటి సీక్వెల్ ను తీసుకువస్తారో చూడాలి.
Follow
Post a Comment