అందుకే రీ ఎంట్రీ ఇచ్చాను: వేణు తొట్టెంపూడి


స్వయంవరం, హనుమాన్ జక్షన్, అల్లరే అల్లరి, పెళ్ళాం ఉరేలితే, శ్రీకృష్ణ 2006 ఇలా విభిన్నమైన సినిమాలతో ఒకప్పుడు తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న వేణు తొట్టెంపూడి ఆ తర్వాత 2013లో నుంచి సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యాడు. అతను చివరగా నటించిన గోపి గోపిక గోదావరి సినిమా మంచి సక్సెస్ అయినప్పటికీ ఆ తర్వాత పెద్దగా అవకాశాలు రాలేదు. ఇక చివరిగా దమ్ము సినిమాలో ఒక స్పెషల్ పాత్రలో నటించిన విషయం తెలిసిందే. 

ఇక ఆ తర్వాత బిజినెస్ వ్యవహారాలతో బిజీగా మారిపోయిన వేణు రామారావు ఆన్ డ్యూటీ సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇస్తున్నాడు. అయితే రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన హఠాత్తుగా సినిమాల్లోకి రీ ఎంట్రీ  ఇవ్వడానికి గల ఒక కారణాన్ని తెలియజేశారు. ఎక్కువగా లాక్ డౌన్ లో వెబ్ సిరీస్ లు అలాగే ఇతర ఓటీటీ సినిమాలు కూడా చూశాను. ఆ తరుణంలోనే నాకు మళ్ళీ నటించాలని అనిపించింది. ఇక అదే సమయంలో దర్శకుడు శరత్ రామారావు కథ గురించి చెప్పాడు. అప్పటికి కూడా నేను నటించాలని పూర్తిగా అనుకోలేదు కానీ ఆ కథ చెప్పగానే ఎంతగానో కనెక్ట్ అయింది. ఈ సినిమాలో ఒక సీఐ గా కనిపించబోతున్నాను. తప్పకుండా పాత్ర పాజిటివ్ నెగిటివ్ అని కాకుండా ఒక డిఫరెంట్ యాంగిల్ లో ఉంటుంది అని చాలా ఛాలెంజింగ్ గా ఆ పాత్రను చేసినట్లు వేణు వివరణ ఇచ్చాడు.

Post a Comment

Previous Post Next Post