బాలీవుడ్ స్టార్స్ టైగర్ ష్రాఫ్ దిశా పటానీ గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఎన్నోసార్లు ప్రేమ యాత్రలు చేసిన ఈ స్టార్స్ ఎన్నడూ కూడా ఆఫీషియల్ గా అయితే వారి ప్రేమ వ్యవహారంపై క్లారిటి ఇచ్చింది లేదు. ఇద్దరు కెరీర్‌ను ఒకే సమయంలో ప్రారంభించారు. ఇక ఆరు సంవత్సరాల క్రితం డేటింగ్ ప్రారంభించారు.
ఇక బాలీవుడ్ మీడియా టాక్ ప్రకారం టైగర్ ష్రాఫ్ మరియు దిశా పటానీ మధ్య అంతా సరిగ్గా లేదని తెలుస్తోంది. ఇద్దరూ తమ వ్యక్తిగత కారణాల వల్ల విడిపోయారని పెళ్లి చేసుకునేందుకు సిద్ధంగా లేరని టాక్. టైగర్ దిశా సన్నిహితులు కొందరు అది నిజమే అనేలా రియాక్ట్ అవుతున్నారట. ఇక దిశా తెలుగులో వరుణ్ తేజ్ లోఫర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు బాలీవుడ్ లో రెగ్యులర్ హీరోయిన్ గా సినిమాలు చేస్తున్న దిశా పటానీ ఏక్ విలన్ రిటర్న్స్ విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇక టైగర్ ష్రాఫ్ తదుపరి చిత్రం స్క్రూ ధీలా ఇటీవలే ప్రకటించబడింది. ఈ చిత్రం టాలీవుడ్ బ్లాక్‌బస్టర్ ఇస్మార్ట్ శంకర్‌కి రీమేక్ అని తెలుస్తోంది.
Follow
Post a Comment