సాయి పల్లవి బోర్ కొట్టేసిందా?


ఫిదా సినిమా కంటే ముందే తెలుగు ఆడియెన్స్ ను బాగా ఎట్రాక్ట్ చేసిన సాయి పల్లవి ఆ సినిమా అనంతరం మరింత క్రేజ్ అందుకొని మంచి డిమాండ్ ను ఏర్పరచుకుంది.  దీంతో ఆమెకు ఆఫర్స్ కూడా గట్టిగానే వచ్చాయి. కానీ ఫిదా అనంతరం ఏ సినిమా కూడా ఆ రేంజ్ లో సక్సెస్ అవ్వలేదు. MCA కమర్షియల్ రోటీన్ సినిమా. ఇక ఆ తరువాత పడి పడి లేచే మనసు బిగెస్ట్ డిజాస్టర్. 

లవ్ స్టొరీ శేఖర్ కమ్ముల ఫ్యాక్టర్, మార్కెట్ డిమాండ్ ను బట్టి ఎదో అలా ఆడేసింది గాని అదేమీ గుర్తుంచుకునేంత సినిమా అవ్వలేదు. ఇక ఇటీవల విరాటపర్వం సాయి పల్లవి కెరీర్ మొత్తంలో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. సినిమా కంటెంట్ యాక్టింగ్ ఎలా ఉన్నా సాయి పల్లవి క్రేజ్ ఇప్పుడు సినిమాలకు హెల్ప్ అవ్వడం లేదని అనిపిస్తోంది. గార్గి అనే మరో సినిమా చేస్తోంది. త్వరలోనే ఆ సినిమా విడుదలవుతున్నట్లు కూడా ఎవరికి తెలియదు. ఏదేమైనా సాయి పల్లవి కథ నచ్చకపోయినా స్టార్ హీరోలను సైతం రిజెక్ట్ చేస్తోంది. ఇక ఇప్పుడు ఆమె సినిమాలకు మొదట్లో వచ్చినంత హైప్ రాకపోవడంతో బోర్ కొట్టేసిందా అనే సందేహాలు వస్తున్నాయి.

Post a Comment

Previous Post Next Post