తమిళ నటుడు విశాల్ కు తెలుగులో కూడా మంచి గుర్తింపు ఉన్న విషయం తెలిసిందే. ఎలాంటి సినిమా చేసిన కూడా తమిళంలో పాటు తెలుగులో కూడా అదే తరహాలో విడుదల చేస్తూ ఉంటాడు. అయితే ఇటీవల కాలంలో మాత్రం అతను సినిమాలతో అనుకున్నంత స్థాయిలో సక్సెస్ అవడం లేదు. పలు కాంట్రవర్సీ న్యూస్ లతోనే విశాల్ పేరు మీడియాలో హాట్ టాపిక్ గా మారుతుంది.
ఇక గతంలో అతను వరలక్ష్మి శరత్ కుమార్ తో ప్రేమలో ఉన్నట్లు టాక్ వచ్చిన విషయం తెలిసిందే. అనంతరం 2019లో హైదరాబాద్ కు చెందిన నటి అనిషాతో నిశ్చితార్థం కూడా జరిగింది. కానీ ఆ తర్వాత విబేధాల వలన పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది. ప్రస్తుతం విశాల్ మరోసారి ప్రేమలో పడ్డట్లుగా తెలుస్తోంది. ఇటీవల అతను ప్రేమ విషయంపై ఓపెన్ గానే బయటకు చెప్పేశాడు. ప్రస్తుతం తాను ప్రేమలో ఉన్నట్లు చెబుతూ త్వరలోనే ఆ విషయంపై క్లారిటీ ఇస్తాను అని అన్నాడు. ఇక విశాల్ నెక్స్ట్ సినిమా లాఠీ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.
Follow
Post a Comment