ప్రభాస్ కోసం కరీనా కపూర్?


రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి రాబోతున్న సినిమాలలో స్పిరిట్ పై కూడా అంచనాలు గట్టిగానే ఉన్నాయి సందీప్ రెడ్డివంగా దర్శకత్వంలో రాబోయే ఈ సినిమా మొదలవడానికి ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ దర్శకుడు ముందుగానే స్క్రిప్ట్ కు సంబంధించిన కొన్ని పనుల విషయంలో కీలకమైన నిర్ణయాలు తీసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. 

అయితే ప్రభాస్ సినిమాలో కరీనాకపూర్ కూడా నటించే అవకాశం ఉందట. దర్శకుడు సందీప్ రెడ్డి ప్రస్తుతం బాలీవుడ్లో రణబీర్ కపూర్ తో ఎనిమల్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే స్పిరిట్ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కోసం కూడా అప్పుడప్పుడు తన యూనిట్ తో చర్చలు జరుపుతున్న సందీప్ అందులో ఒక పాత్ర కోసం కరీనాకపూర్ అయితే బాగుంటుంది అని ముందుగానే ఆమె ను ఫైనల్ చేసి ప్రాజెక్టు కోసం అగ్రిమెంట్ చేసుకోవాలి అని అనుకుంటున్నారట. మరి ఆమె ఎలాంటి పాత్రలో నటిస్తుందో చూడాలి.

Post a Comment

Previous Post Next Post