ఆ హీరోలకు తల్లిగా పవిత్ర లోకేష్.. దండం పెట్టేశారు!


టాలీవుడ్ లో ఉన్న కొంతమంది స్టార్ హీరోలకు చిన్న హీరోలకు తల్లి పాత్రల్లో ఎక్కువగా కనిపించిన వారిలో పవిత్ర లోకేష్ ఒకరు. అయితే ఆమె ఇటీవల ఎవరు ఊహించని విధంగా ఒక వివాదంలో చిక్కుకోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. సీనియర్ నటుడు VK నరేష్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్ర లోకేష్ కు సంబంధించిన వార్తలు ఏ రేంజ్ లో వైరల్ అవుతున్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 


వారిద్దరికీ పెళ్లి కానుందని ఎఫైర్ ఉందని నరేష్ మూడో భార్య కామెంట్స్ చేసింది. అయితే నరేష్ , పవిత్ర మాత్రం మేము మంచి ఫ్రెండ్స్ మాత్రమే అని చెప్పన మరుసటిరోజే హోటల్ లో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడడం మరీంత వివాదానికి దారి తీసింది. ఈ క్రమంలో పవిత్ర లోకేష్ కు వచ్చిన అవకాశాలు కూడా ఎగిరిపోతున్నట్లు తెలుస్తోంది. ఆమెను తల్లి పాత్రకు సెలెక్ట్ చేసుకోగా ఓ ఇద్దరు హీరోలు ఇటీవల దండం పెట్టేసి వద్దని నిర్మాతలకు చెప్పేశారట. నరేష్ అయితే ఇండస్ట్రీలో బిజిగానే ఉన్నప్పటికీ పవిత్రకు మాత్రం తల్లి పాత్రలు పాజిటివ్ రోల్స్ రావడం లేదని టాక్.


Post a Comment

Previous Post Next Post