విక్రమ్ కె కుమార్ నాగచైతన్య నాగ్ కలయికలో వచ్చిన మనం సినిమా అప్పట్లో బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. ఇక మళ్ళీ ఇన్నాళ్లకు విక్రమ్ నాగచైతన్యతో సినిమా చేస్తుండడంతో తప్పకుండా సక్సెస్ అవుతుందని దిల్ రాజు కాంబినేషన్ పై బాగానే ఖర్చు చేశాడు. వీరి కలయికలో తెరకెక్కిన థాంక్యు సినిమా ఈ నెల 22న విడుదల కానుంది.
అయితే థాంక్యూ సినిమా విడుదలపై ఎలాంటి హడావుడి కనిపించడం లేదు. విడుదలైన సాంగ్స్ కూడా క్లిక్కవ్వలేదు. టీజర్ కు కూడా రెస్పాన్స్ పెద్దగా వచ్చిందేమి లేదు. ఇక ఓపెనింగ్స్ వస్తాయా రావో అనే టెన్షన్ మొదలైంది. ఈ క్రమంలో కార్తికేయ సినిమా ఒక్కసారిగా హైప్ బజ్ క్రియేట్ చేయడంతో ఆ సినిమాని వాయిదా వేసుకునేలా దిల్ రాజు రాజకీయాలు స్టార్ట్ చేసినట్లు సమాచారం. ఇదివరకే నిర్మాతలతో కూడా మాట్లాడినట్లు తెలుస్తోంది. మరి ఈ క్లాష్ విషయంలో కార్తికేయ టీమ్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.
Follow @TBO_Updates
Post a Comment