ఆదిపురుష్.. ఆలస్యమైనా కిక్కిచ్చే సర్‌ప్రైజ్


రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు చాలా రోజులుగా ఆదిపురుష్ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ కోసం ఎంతో ఆతృత ఎదురు చేస్తున్నారు. ఈ సినిమా మొదలుపెట్టి చాలా కాలం అవుతున్నా ఇంకా దర్శకుడు ఓం రావత్ నుంచి సరైన అప్డేట్ అయితే రావడం లేదు. షూటింగ్ మొత్తం ముగిసిన కూడా ఇంతవరకు ప్రభాస్ కు సంబంధించిన ఒక లుక్ కూడా విడుదల చేయలేదు.

అయితే ఆలస్యమైనా కూడా మంచి కిక్ ఇచ్చే ఫస్ట్ లుక్ ను విడుదల చేస్తారు అని తెలుస్తోంది. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించబోతున్న విషయం తెలిసిందే. ఇక సినిమాను త్రీడి టెక్నాలజీతో విడుదల చేయబోతున్నారు. అందుకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయి. అయితే సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ను కూడా 3D టెక్నాలజీ తోనే రెడీ చేయబోతున్నారట. ఆ టీజర్ కొన్ని సినిమా ధియేటర్స్ లో కూడా త్వరలోనే విడుదలవుతుంది అని సమాచారం.

Post a Comment

Previous Post Next Post