విజయ్ దేవరకొండ లైగర్ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ డోస్ పెంచడంలో బిజీగా మారిపోతున్నాడు. ఎప్పుడో రావాల్సిన ఈ సినిమా మొత్తానికి ఏడాది ఆగస్టు 25వ తేదీన విడుదల కావడానికి సిద్ధమైన విషయం తెలిసిందే. పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేసిన ఈ పాన్ ఇండియా సినిమాతో దేవరకొండ ఆల్ ఇండియా స్థాయిలో హైప్ క్రియేట్ చేయడానికి సిద్ధమవుతున్నట్లు అర్థమవుతుంది.
అయితే సినిమాకు సంబంధించిన ఒక న్యూడ్ పోస్టర్ను విడుదల చేయడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఏకంగా మొదటిసారి విజయ్ దేవరకొండ బాలీవుడ్ స్టార్స్ తరహాలో అందరినీ ఎట్రాక్ట్ చేయడానికి ఈ తరహా ప్లాన్ వేసినట్లు అర్థమయింది. కాకపోతే తెలుగు జనాలకు మాత్రం ఈ అవతారం కొంచెం కూడా నచ్చడం లేదు. నార్త్ ఆడియన్స్ ను ఆకట్టుకునేందుకు ఇది బాగానే వర్కౌట్ కావచ్చు కానీ తెలుగులో మాత్రం కొంత నెగిటివ్ ఇంప్రెషన్ క్రియేట్ చేసే అవకాశం ఉంది. మరి ఈ ఫోటోతో ఎలాంటి భావాన్ని జనాల్లోకి తీసుకువెళ్తారో పూర్తి క్లారిటీ ఇచ్చేవరకు ఆగాల్సిందే.
Follow @TBO_Updates
Post a Comment