రామారావు.. తేడా కొడితే రవితేజకు సున్నా!


మాస్ మహారాజా రవితేజ మళ్ళీ ఫామ్ కోల్పోయిన సమయంలో రామారావు ఆన్ డ్యూటీ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఇంతకుముందు క్రాక్ సినిమాతో మంచి సక్సెస్ అందుకోవడమే కాకుండా లాభాల్లో వాటా కూడా అందుకొని దాదాపు 16 కోట్లు జేబులో వేసుకున్నాడు. ఇక ఆ తరువాత చేసిన ఖిలాడి సినిమా మాత్రం ఊహించని విధంగా తేడా కొట్టేసింది. 

ఇక ఇప్పుడు రామరావు ఆన్ డ్యూటీ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుంది అనేది హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇక ఈ సినిమాతో రవితేజ ఏకంగా సొంత బ్యానర్ ను స్టార్ట్ చేయడం విశేషం. SLV సినిమాస్ తో పాటు RT టీమ్ వర్క్స్ అని రవితేజ లాభాల్లో వాటా అందుకునేలా డీల్ సెట్ చేసుకున్నాడు. ఇక ఈ సినిమా ఏ మాత్రం తేడా కొట్టినా కూడా రవితేజకు ఒక్క రూపాయి కూడా రానట్లే. ఎందుకంటే నిర్మాత నుంచి ఒక్క రూపాయి రెమ్యునరేషన్ కూడా తీసుకోలేదట. డైరెక్ట్ గా సినిమా బిజినెస్ ను బట్టి లాభాల్లో ప్రాఫిట్ వచ్చేలా మాట్లాడుకున్నట్లు సమాచారం. మరి సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Post a Comment

Previous Post Next Post