మెగా కోడలు ఉపాసన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణిగా కంటే కూడా మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకుంటోంది. బిజినెస్ ఉమెన్ గా అపోలో లైఫ్ చైర్ పర్సన్ గా కూడా ఆమె కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే పెళ్లి జరిగి పదేళ్లయినా కూడా మెగా దంపతులు పిల్లల్ని కనకపోవడంపై అనేక రకాల వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇక అది తమ వ్యక్తిగత విషయమని చాలాసార్లు ఉపాసన వివరణ ఇచ్చింది.
ఇక రీసెంట్ గా సద్గురు ఈవెంట్ లో ఆమె ఒక ప్రశ్న అడిగారు. తన లైఫ్ లో పిల్లల్ని కనే విషయంపై జనాల్లో చర్చ జరుగుతూనే ఉందని చెప్పడంతో ఒకరి వ్యక్తిగత విషయంలో ఎవరి కామెంట్స్ అవసరం లేదని.. అసలు ఇప్పుడున్న వారు పిల్లలను కనాల్సిన అవసరం లేదని అలా ఉండేవారికి నేను బహుమతులు ఇస్తానని అత్యద్మీక గురువు సద్గురు అన్నారు. ఎందుకంటే ప్రపంచంలో ఇప్పటికే చాలా జనాభా పెరిగిపోతోంది అని ఇక అవసరం లేదని ఒకవేళ నువ్వు అడపులి అయితే తప్పకుండా పిల్లల్ని కనాల్సి ఉండేదని, ఎందుకంటే వాటి సంఖ్య తక్కువగా ఉందని సద్గురు అన్నారు.
Follow @TBO_Updates
Post a Comment