1990 చివరలో ఎక్కువగా లవ్ స్టోరీ సినిమాలతో బాగా పాపులర్ అయిన వారిలో వడ్డే నవీన్ ఒకరు పెళ్లి, మనసిచ్చి చూడు, మా బాలాజీ, స్నేహితులు ఇలా విభిన్నమైన యూత్ ఫుల్ కథలతో అప్పట్లో ఓవర్గం ప్రేక్షకులను ఈ హీరో ఎంతగానో పట్టుకున్నాడు. చూడడానికి హ్యాండ్సమ్ లుక్స్ తో అమ్మాయిలకు కూడా బాగా నచ్చేసాడు.
అయితే వడ్డే నవీన్ కొన్నేళ్ల తరువాత సినిమాలకు దూరమయ్యాడు చివరగా తను రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో 2016లో ఎటాక్ అనే సినిమాలో అలా కనిపించి వెళ్లిపోయారు. ఇక ఇన్నాళ్లకు మళ్ళీ రీఎంట్రీ ఇవ్వడానికి ఒక ప్లాన్ వేసినట్లుగా తెలుస్తోంది. బిగ్ బాస్ ద్వారా అతను జనాలకు మళ్ళీ దగ్గరవ్వాలని అనుకుంటున్నాడట. త్వరలో ఆరంభం కాబోయే 6వ సీజన్ కోసం నిర్వాహకులు అతన్ని సంప్రదించినట్లుగా తెలుస్తోంది. భారీ స్థాయిలో రెమ్యునరేషన్ ఇచ్చి కంటెస్టెంట్ గా హౌస్ లోకి రప్పించనున్నారట. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరి కొంత కాలం ఆగాల్సిందే.
Follow
Post a Comment