టాలెంటెడ్ హీరోయిన్ నయనతార సక్సెస్ తో సంబంధం లేకుండా అవకాశాలు అందుకుంటుంది. ఇక ఇటీవల ఆమె తన ప్రియుడు విగ్నేష్ ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే సాధారణంగా పెళ్లి తర్వాత హీరోయిన్స్ సినిమాలు తగ్గించేస్తారు. అంతేకాకుండా ఒకవేళ సినిమాలు చేసినా కూడా రెమ్యునరేషన్ గతంలో మాదిరిగా అయితే ఎక్కువగా తీసుకోరు.
కానీ నయనతార మాత్రం ఆ రెండు విషయాల్లో పాత రూల్స్ ను బ్రేక్ చేస్తూ అవకాశాలు బిగ్ మూవీస్ లో ఛాన్స్ లు అందుకోవడమే కాకుండా రెమ్యునరేషన్ డోస్ కూడా పెంచేసింది. రీసెంట్ గా 75వ సినిమా ఎనౌన్స్మెంట్ వచ్చింది. అయితే ఆ సినిమా కోసం నయనతార ఏకంగా 10 కోట్ల వరకు రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. పెళ్లికి ముందుకు 6 కోట్లు తీసుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు ఏకంగా ఒకేసారి 10 కోట్లు దక్కించుకోవడం హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు అట్లీ దర్శకత్వంలో షారుఖాన్ హీరోగా నటిస్తున్న బాలీవుడ్ చిత్రంలో కూడా అమ్మడు మెయిన్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.
Follow
Post a Comment