టైర్ 2 హీరోలంతా ముంచారు.. మరి నాగచైతన్య?


నాగచైతన్య నటించిన థాంక్యూ సినిమా ఈ శుక్రవారం భారీ స్థాయిలోనే విడుదల కాబోతోంది. నిర్మాత దిల్ రాజు పక్కా ప్రణాళికతో ఈ సినిమాను విడుదల చేస్తున్నాడు. అయితే సినిమా ప్రమోషన్స్ విషయంలో మాత్రం పెద్దగా హడావిడి కనిపించడం లేదు. ఇంతవరకు సినిమాను చూడాలి అన్న ఆసక్తి కూడా పెద్దగా కలగలేదు. అయితే ఈ ఏడాది టైర్ 2 లెవెల్ హీరోలు పూర్తిగా నిరాశపర్చారు అనే చెప్పాలి.

అందరూ కూడా 10 నుంచి 20 కోట్ల మధ్యలో నష్టాలను కూడా కలిగించారు. ఇటీవల నాని నటించిన అంటే సుందరానికి సినిమా థియేట్రికల్ గా 10 కోట్ల వరకు నష్టాలను కలిగజేసింది. వరుణ్ తేజ్ గని సినిమా కూడా 15 కోట్ల నష్టాలను కలిగించగా.. రానా విరాటపర్వం సినిమా దాదాపు 10 కోట్ల వరకు పోగొట్టేసింది. ఇక రీసెంట్ గా వచ్చిన రామ్ పోతినేని ది వారియర్ సినిమా కూడా దాదాపు నష్టాల బాటలోనే వెళుతోంది. ఈ మూవీ కూడా 15 కోట్ల నష్టాలను కలిగించే అవకాశం అయితే ఉంది.

ఇక ఇప్పుడు థాంక్యూ సినిమా బాక్సాఫీస్ వద్ద దాదాపు 24 కోట్ల బిజినెస్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా సక్సెస్ అవ్వాలి అంటే 25 కోట్లు అందుకుంటేనే సక్సెస్ అయినట్లు లెక్క. అయితే నాగచైతన్య గత నాలుగు సినిమాల కూడా బాక్సాఫీస్ వద్ద బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను పూర్తి చేశాయి. మరి ఈ సినిమా ఎన్ని రోజుల్లో ఆ టార్గెట్ ను అందుకుంటుందో చూడాలి.

Post a Comment

Previous Post Next Post