తమిళ టాలెంటెడ్ నటుడు చియాన్ విక్రమ్ కు నేడు జూలై 8న గుండెపోటు రావడంతో వెంటనే చెన్నైలోని కావేరి ఆసుపత్రికి తరలించినట్లు తమిళ మీడియాలో జోరుగా వార్తలు వచ్చాయి. అయితే ఆయనకు గుండెపోటు రాలేదని వైరల్ ఫీవర్ కారణంగానే హాస్పిటల్ లో చేరినట్లు చెబుతున్నారు. ఇక విక్రమ్ ఆరోగ్యం విషయంలో ఇంకా ఆసుపత్రి నుంచి ఎలాంటి అప్‌డేట్ అయితే రాలేదు..
నేడు సాయంత్రం 6 గంటలకు చెన్నైలో జరగాల్సిన తన పొన్నియిన్ సెల్వన్ టీజర్ లాంచ్‌కి అతను హాజరు కావాల్సి ఉంది. కానీ ఇంతలోనే విక్రమ్ హఠాత్తుగా అనారోగ్యానికి గురవ్వడంతో అందరూ షాక్ అయ్యారు. అభిమానులు కూడా అతని ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారు. ఎలాంటి పాత్రలో అయినా ప్రాణం పెట్టి నటించే విక్రమ్ త్వరగా కోలుకోవాలని కూడా కోరుకుంటున్నారు. పొన్నియిన్ సెల్వన్ సినిమాకు మణిరత్నం దర్శకత్వం వహించగా సెప్టెంబరు 30న ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Post a Comment