500 కోట్ల ప్రాజెక్ట్ K.. కరెక్ట్ కాదు డార్లింగ్?


ప్రభాస్ తో ప్రముఖ నిర్మాత సి.అశ్వినీ దత్ నిర్మిస్తున్న ప్రాజెక్ట్ కోసం దాదాపు 500 కోట్లు ఖర్చు చేయబోతున్న విషయం తెలిసిందే. మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న ఈ ప్రాజెక్ట్ టైమ్ ట్రావెల్ నేపథ్యంలో విజువల్ అడ్వెంచర్ ఫిల్మ్ గా తెరకెక్కుతోంది. హాలీవుడ్ లో కూడా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చెయాలి అని అశ్వినీ దత్ తన 50 ఏళ్ళ అనుభవాన్ని మొత్తం ఈ సినిమాపై పెడుతున్నారు.

అయితే ఈ ప్రాజెక్ట్ ఆ స్థాయిలో తెరపైకి వస్తుంటే ప్రభాస్ తీసుకున్న ఒక నిర్ణయం పై అశ్వినీ దత్ వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ సినిమా చేయడం ఆ నిర్మాతకు ఏ మాత్రం నచ్చలేదట. అసలే సాహో, రాధే శ్యామ్ సినిమాలతో తీవ్రంగా నిరాశ పరిచిన ప్రభాస్ బాక్సాఫీస్ వద్ద తన రేంజ్ ను తగ్గించుకున్నాడు. ఇక ఇప్పుడు మారుతితో రోటీన్ కామెడీ హారర్ కమర్షియల్ సినిమా చేస్తే నెక్స్ట్ సినిమాల మార్కెట్ పై ప్రభావం పడే అవకాశం అయితే ఉంది. అందుకే అశ్వినీ దత్ ఏ మాత్రం ఒప్పుకోవడం లేదని సమాచారం. మరి టాక్ ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.


Post a Comment

Previous Post Next Post