50 కోట్ల హీరోయిన్.. చప్పుడే లేదు?


ఫిదా సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన సాయి పల్లవి కేవలం తన స్టార్ ఇమేజ్ తోనే 50 కోట్ల కలెక్షన్స్ అందుకుంది అని చెప్పవచ్చు. ఆ సినిమాలో తర్వాత ఆమె నానితో చేసిన ఎంసీఏ సినిమా కూడా కమర్షియల్ గా సక్సెస్ అయ్యింది. అయితే ఒకప్పుడు ఆ స్థాయిలో మార్కెట్ అందుకున్న సాయి పల్లవి ఇటీవల కాలంలో మాత్రం వరుస అవుఅజయలను ఎదుర్కొంటుంది. 

విరాటపర్వం సినిమా కూడా కనీసం పెట్టిన పెట్టుబడిలో సగం కూడా వెనక్కి తీసుకురాలేకపోయింది. ఇక ఇప్పుడు ఆమె నటించిన గార్గి అనే ఒక సినిమా విడుదల అవుతుంది అని కూడా చాలామందికి తెలియకపోవడం షాకింగ్ అనే చెప్పాలి. గార్గి సినిమాలో చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న తన తండ్రిని అన్యాయం నుంచి ఎలా కాపాడుకుంటుంది అనే కాన్సెప్ట్ తో తెరకెక్కింది. ఈ సినిమా ట్రైలర్ చాలా ఎమోషనల్ గా ఉన్నప్పటికీ కూడా ఆడియన్స్ అయితే పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. గార్గి సినిమాను ఈ నెల 15వ తేదీన విడుదల చేయబోతున్నారు. మరి సినిమా బాక్సాఫీస్ వద్ద ఏదైనా మ్యాజిక్ క్రియేట్ చేస్తున్న లేదో చూడాలి.

Post a Comment

Previous Post Next Post