నాని పై 40 కోట్లు.. ఇది పక్కా రిస్క్!


నేచురల్ స్టార్ నాని మార్కెట్ ప్రస్తుతం తగ్గింది అని తెలుస్తోంది. ఒకప్పుడు నాని తో సినిమా చేస్తే మినిమమ్ గ్యారెంటీ అని ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద టార్గెట్ ను అందుకోవడం లేదు. ఇప్పుడు నాని పై ఒక 20 కోట్లు పెట్టడమే ఎక్కువ అనుకుంటున్న సమయంలో దసరా సినిమాకి 40 కోట్లు పెడుతుండడం హాట్ టాపిక్ గా మారింది.

అప్పుడెప్పుడో నిన్నుకొరి MCA సినిమా అనంతరం మళ్ళీ నాని బాక్సాఫీస్ వద్ద సరైన సక్సెస్ అందుకోలేకపోయాడు. ఎలాంటి సినిమా చేసినా కూడా ప్రశంసలు వస్తున్నాయి కానీ కలెక్షన్స్ విషయంలో మాత్రం ఎవరో ఒకరు లాస్ అవుతున్నారు. జెర్సీ, శ్యామ్ సింగరాయ్ మంచి సినిమాలే కానీ బడ్జెట్ ఎక్కువ కావడంతో పెట్టిన పెట్టుబడికి సరైన లాభాలు రాలేదు. ఇటీవల వచ్చిన అంటే సుందరానికి కూడా మరీ అంత బ్యాడ్ సినిమా కాదు. కానీ అది కూడా రెమ్యునరేషన్స్ బడ్జెట్ కారణంగా నష్టాలు మిగిల్చింది. ఇక ఇప్పుడు ఏ మాత్రం బజ్ లేని దసరా సినిమాకి ఏకంగా 40 కోట్లు పెట్టడం రిస్క్ అనే కామెంట్స్ వస్తున్నాయి.

Post a Comment

Previous Post Next Post