సూర్య: తెలుగులో ఒకప్పుడు 30కోట్లు.. ఇప్పుడు 3కోట్లు


మొత్తానికి సూర్య మొదటిసారి ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డును సొంతం చేసుకున్నడు. ఇక రజనీకాంత్ కమలహాసన్ తర్వాత తెలుగులో మంచి గుర్తింపు అందుకున్న తమిళ హీరోల్లో సూర్య ఒకరు. ఒక విధంగా సూర్య ఒకానొక సమయంలో తెలుగు హీరోలతో సమానంగా తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ ఏర్పరుచుకున్నాడు. అతనికి తెలుగులో అయితే భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అని చెప్పవచ్చు. 

అయితే గతంలో మాత్రం 30 కోట్ల వరకు బాక్సాఫీస్ కలెక్షన్స్ అందుకున్న సూర్య ఇప్పుడు మాత్రం కనీసం మూడు కోట్లు బిజినెస్ ను కూడా దక్కించుకోలేకపోతున్నాడు. ఇటీవల సూరారై పోట్రు సినిమాతో నేషనల్ కూడా అందుకున్న విషయం తెలిసిందే. తెలుగులో ఆకాశమే నీ హద్దురా అనే టైటిల్ తో విడుదలైన ఈ సినిమా మంచి రెస్పాన్స్ అందుకుంది. ఒకవేళ థియేట్రికల్ గా ఈ సినిమా విడుదలై ఉంటే మంచి కలెక్షన్స్ అందుకొని ఉండేదేమో అనే అభిప్రాయాలు వస్తున్నాయి.   

ఇక గతంలో సూర్య గజినీ సినిమాతో మొట్టమొదటిసారి తెలుగు రాష్ట్రాల్లోనే 25 కోట్ల గ్రాస్ వరకు బాక్సాఫీస్ కలెక్షన్స్ అందుకున్నాడు. ఆ తరువాత 7th సెన్స్ సినిమాకి యావరేజ్ టాక్ వచ్చినప్పటికీ కూడా 30 కోట్లు గ్రాస్ అందుకోవడం విశేషం. ఇక 24 సినిమా కూడా 30 కోట్ల గ్రాస్ ను సొంతం చేసుకుంది. అయితే సూర్య చివరి సినిమాలలో NGK, బందోబస్తు, ET మాత్రం కనీసం మూడు కోట్ల షేర్ కలెక్షన్స్ కూడా అందుకోలేకపోయాయి. 

బలమైన కంటెంట్ తో ఆడియన్స్ మెప్పిస్తే మాత్రం మళ్ళీ సూర్య తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ స్థాయిలో క్రేజ్ అందుకునే అవకాశం అయితే ఉంది. ఇటీవల వచ్చిన విక్రమ్ సినిమాలో రోలెక్స్ అనే గెస్ట్ పాత్రలో నటించి మంచి క్రేజ్ అయితే అనుకున్నాడు. ఇక బాల దర్శకత్వంలో అచలుడు అనే సినిమా చేస్తున్నాడు. తప్పకుండా సినిమా సక్సెస్ అవుతుంది అని నమ్మకంతో ఉన్నాడు. మరి సూర్య గతంలో మాదిరిగా 30 కోట్ల బాక్సాఫీస్ కలెక్షన్స్ అందుకుంటాడో లేదో చూడాలి.

Post a Comment

Previous Post Next Post