ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మాతగా అనుదీప్ దర్శకత్వంలో వచ్చిన జాతి రత్నాలు సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఈ సినిమాకు సీక్వెల్ రానుంది అని దర్శకుడు అప్పట్లోనే ఒక క్లారిటీ ఇచ్చాడు.
అయితే దర్శకుడు అనుదీప్ ఇటీవల తన శిష్యుడి సినిమా ఇంటర్వ్యూలో సీక్వెల్ పై క్లారిటీ ఇచ్చాడు. ఆ సినిమా రావడానికి ఇంకాస్త ఎక్కువ సమయం పడుతుంది అని ముఖ్యంగా హీరోని అలాగే నాగ్ అశ్విన్ ని కూడా ఒప్పించడం చాలా కష్టమని దాదాపు ఒక నాలుగేళ్ళ సమయం పట్టవచ్చు అని తన వైపు నుంచి ఒక క్లారిటీ అయితే ఇచ్చాడు. ఇక ప్రస్తుతం ఈ దర్శకుడు శివ కార్తికేయన్ తో ప్రిన్స్ అనే ఒక సినిమాను సిద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమా ఇదే ఏడాది దీపావళికి విడుదల కానుంది.
Follow
Post a Comment