పుష్ప సెకండ్ పార్ట్ ది రూల్ కోసం దర్శకుడు సుకుమార్ మరింత పవర్ఫుల్ గా స్క్రిప్ట్ రెడీ చేసుకుంటున్నాడు. ఇంతకుముందు ఫస్ట్ పార్ట్ షూట్ పూర్తి చేసినప్పుడే సెకండ్ పార్ట్ కు సంబంధించిన చాలావరకు షూటింగ్ పూర్తి అయినప్పటికీ కూడా మళ్లీ కొన్ని ఎపిసోడ్స్ ను రీ షూట్ చేయాలని అనుకుంటున్నారు. అంతేకాకుండా ఇంటర్వెల్ అనంతరం రిఫ్రెష్ గా మళ్లీ కొత్త సీన్లు క్రియేట్ చేసే చాన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది.
అయితే ఈ సినిమాలో భన్వర్ సింగ్ షికావత్ క్యారెక్టర్ చనిపోతుందట. దీంతో ఆ తర్వాత సెకండ్ హఫ్ లో మరింత పవర్ఫుల్ గా ఉండాలి అని విజయ్ సేతుపతిని లాగుతున్నట్లుగా తెలుస్తోంది. అసలైతే ఫాహధ్ చేసిన విలన్ క్యారెక్టర్ కోసం మొదలట విజయ్ సేతుపతి ని తీసుకోవాలని అనుకున్నారు. కానీ అప్పుడు అతను బిజీగా ఉండడంతో కుదరలేదు. ఇక ఇప్పుడు పుష్ప సెకండ్ పార్ట్ పై అంచనాలు పెరిగిపోవడంతో పాటు అంతేకాకుండా 10 కోట్ల వరకు పారితోషికం ఆఫర్ చేయడంతో సేతుపతి సినిమా చూసేందుకు సిద్ధంగానే ఉన్నాడట. అతను సెకండ్ హాఫ్ లో ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాడని తెలుస్తోంది మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరి కొంతకాలం ఎదురుచూడాల్సిందే.
Follow @TBO_Updates
Post a Comment