దర్శకుడు సుకుమార్ పుష్ప సెకండ్ పార్ట్ ను వీలైనంత తొందరగా మొదలు పెట్టాలని అనుకున్నప్పటికీ మొదటి పార్ట్ సాధించిన విజయంతో ఇప్పుడు కాస్త జాగ్రత్తగా అడుగులు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. స్క్రిప్ట్ లో మార్పులు కూడా చేయాల్సి వస్తోంది. సినిమా అంతకుమించి అనేలా ఉండాలి అని హీరో అల్లు అర్జున్ కూడా చాలాసార్లు దర్శకుడితో చర్చలు జరిపారు.
దీంతో ఇప్పుడు మళ్లీ కొత్త రంగులతో పుష్ప సెకండ్ పార్ట్ స్క్రిప్టు రెడీ అవుతోంది. అయితే ఈ తరుణంలో దర్శకుడు మరొక ప్రముఖ రైటర్ ను తీసుకున్నాడు. అతను మారెవరో కాదు.. శిష్యుడు బుచ్చిబాబు. ఉప్పెన సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు ఉన్న బుచ్చిబాబు సుకుమార్ దర్శకత్వం వచ్చిన చాలా సినిమాలకు రైటర్ గా వర్క్ చేశాడు. ముఖ్యంగా నాన్నకు ప్రేమతో రంగస్థలం సినిమాలో అతని పాత్ర చాలానే ఉంది.
కాబట్టి ఇప్పుడు పుష్ప సెకండ్ పార్ట్ కోసం బుచ్చిబాబు సహాయం కోరుతున్నాడట. మరోవైపు బుచ్చిబాబు జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి కాస్త సమయం పడుతుంది. కాబట్టి ఈ లోపు మళ్ళీ అతను తన గురువు కోసం అసిస్టెంట్ రైటర్ గా మారిపోతున్నట్లు తెలుస్తోంది. ఒక విధంగా ఈ సినిమా విజయం సాధిస్తే అతనికి కూడా మంచి లాభమే అని చెప్పాలి.
Follow
Follow
Post a Comment